గడపకు పసుపు ఎందుకు రాయాలి?
అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి ఉగ్ర రూపంతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. అట్టి గడప శ్రీమహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి. గడప అంటే లక్ష్మి దేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు. మంగళకరమైన కుంకుమతో పాటు పెడతారు. పూర్వ కాలంలో పాముల బెడదగా తరచుండేది. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు, గడపకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు లోపలికి రావు.
